అనగా అనగా ఒక ఊళ్ళో ఒక ఉడుత. ఒక రోజు వాళ్ళ అమ్మతో కలిసి చిలకమ్మ దుకాణానికి వెళ్తుంది.
అక్కడ వాళ్ళ అమ్మ ఇంటికి కావాల్సిన సామాను కొంటుంది. తర్వాత ఉడుతకి ఒక చాక్లెట్ కొనిస్తుంది. ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు. వాళ్ళ అమ్మ సామానంతా ఇంట్లో సర్దేస్తుంది.
తర్వాత ఉడుతతో," ఏది ఆ చాక్లెట్ ఇటివ్వు, ఓపెన్ చేసిస్తాను తిందువుగాని" అంటుంది. ఉడుత ఏడుపుమొహంతో ,"అమ్మా, అది ఎక్కడో పడిపోయింది, నేను చూసుకోలేదు" అంటుంది. అమ్మకి చాలా కోపం వస్తుంది. "అంత అజాగర్త అయితే ఎట్లా, పో పోయి వెదికి తెచ్చుకో" అని అరుస్తుంది.
ఉడుత ఏడ్చుకుంటూ, దారి పొడుగునా వెతుక్కుంటూ మళ్లీ చిలకమ్మ దుకాణానికి వెళ్తుంది.
చిలకమ్మ ఏడుస్తున్న ఉడుతని చూసి ,"ఎందుకు చిన్నా ఏడుస్తున్నావు" అని అడుగుతుంది.
ఉడుత ఏడుస్తూ, "మరి ఇందాక మా అమ్మ నాకు ఒక చాక్లెట్ కొనిచ్చింది. అది ఎక్కడో పడిపోయింది. అమ్మ నన్ను కోప్పడి వెతికి తీసుకురమ్మంది. ఎంత వెదికినా నాకు కనిపించలేదు. ఏమి చెయ్యటమో తోచటంలేదు" అంది.
అప్పుడు చిలకమ్మ నవ్వుతూ, "ఓస్ ఇంతేకదా, ముందు నువ్వు కళ్ళు తుడుచుకో, నీకు ఒక ఉపాయం చెప్తాను" అంది. ఉడుత కళ్ళు తుడుచుకుంది. చిలకమ్మ ," ఇక్కడ పక్కనే గుడ్లగూబ తాతయ్య ఉన్నాడు. ఆయనకి పాపం బాగా జలుబు చేసి జ్వరం వచ్చింది. ఆయనకి ఎవరూ లేరు. ఎవరినన్నా తెలిసినవారిని సహాయానికి పంపమన్నాడు. నువ్వు కనక ఆయన చెప్పిన్నట్టు చేస్తే నీకు తప్పకుండా ఏమైనా ఇస్తాడు. ముందు ఈ విక్స్ డబ్బా తీస్కెళ్ళు" అంది.
అప్పుడు ఉడుత చిలకమ్మ ఇచ్చిన విక్స్ డబ్బా తీసుకుని గుడ్లగూబ తాతయ్య ఇంటికి వెళుతుంది.
ఉడుత వెళ్ళేసరికి గుడ్లగూబ తాతయ్య పెద్ద మంచం మీద , పెద్ద ముసుగు కప్పుకుని పడుకుని ఉంటాడు.
"ఖళ్ ఖళ్.." అని దగ్గుతూ ఉంటాడు. ఉడుతని చూసి "ఎవరూ వచ్చింది?" అన్నాడు. ఉడుత "నేను తాతయ్యా, ఉడుతని" అంది. "ఎందుకు వచ్చావు?" అన్నాడు. ఉడుత, " మరేమో, చిలకమ్మ నన్ను నీకు సహాయం చేయమని పంపింది. నీకు చాలా జలుబు చేసిందటగా" అంది. తాతయ్య," మా తల్లే, ఎంత మంచిదానవు, నాకు సహాయం చేయడానికి వచ్చావా, ఇలా నా దగ్గరికి రా" అన్నాడు. ఉడుత దగ్గరికి వెళ్ళింది. ఉడుత చేతిలోని విక్స్ డబ్బా చూసి ," నాక్కొంచం విక్స్ రాస్తావా" అని అన్నాడు. అప్పుడు ఉడుత విక్స్ డబ్బా తెరిచి కొంచం విక్స్ చేతిలోకి తీసుకుని, తాతయ్య నుదురు మీద ,ముక్కు మీద, బొజ్జకీ, వీపుకి రాస్తుంది. తాతయ్య ," అబ్బా ఎంత హాయిగా ఉందమ్మా, అక్కడ గూట్లో నా మందులు, ఫ్లాస్కు లో కొంచం కాఫీ ఉన్నాయి, తెచ్చిపెట్టు తల్లీ" అన్నాడు. ఉడుత తెచ్చిపెట్టగానే గుడ్లగూబ తాతయ్య మందులు వేసుకుని, కాఫీ తాగుతాడు. "అహా ఎంత మంచిదానివి, చిట్టి తల్లీ నువ్వు చేసిన సహాయం మరిచిపోలేను....." అంటూ ఉడుతని పొగుడ్తూ ఉంటాడు. ఉడుత మనసులో," అబ్బా ఇంకెంత సేపు చేస్తాడు, నాకు ఏమైనా ఇవ్వొచ్చు కదా" అని అనుకుంటుంది. అప్పుడు తాతయ్య, "అరెరె, మర్చిపోయాను, నాకోసం ఇంత సహాయం చేసినందుకు నీకు ఏమైనా ఇవ్వాలి కదా" అని తన దిండు కింద నించి పెద్ద పర్సు తీసి, దాంట్లోంచి 5 రూపాయలు తీసి ఉడుతకి ఇస్తాడు. ఉడుత అది తీసుకుని సంతోషంగా "ధన్యవాదాలు తాతయ్యా" అని చెప్పి ఎగురుకుంటూ, గెంతుకుంటూ చిలకమ్మ దుకాణానికి వెళ్తుంది.
"చిలకమ్మా, నాకు గుడ్లగూబ తాతయ్య 5 రూపాయలు ఇచ్చాడు తెలుసా" అని కళ్ళు ఎగరేస్తూ చెప్తుంది.
చిలకమ్మ ," సెభాష్ తల్లీ", అని ఆ 5 రూపాయలు తీసుకుని ఉడుత కి చాక్లెట్ ఇస్తుంది. అప్పుడు ఉడుత ఆ చాక్లెట్ తీసుకుని, సంతోషంగా, ఈసారి జాగ్రత్తగా పట్టుకుని, మళ్ళీ ఎగురుకుంటూ, గెంతుకుంటూ ఇంటికి వస్తుంది.
వాళ్ళ అమ్మకి చాక్లెట్ చూపిస్తుంది. "అమ్మా నేను గుడ్లగూబ తాతయ్య కి సహాయం చేస్తే, ఆయన నాకు 5 రూపాయలు ఇచ్చాడు.నేనేమో అది తీస్కెళ్ళి చిలకమ్మకి ఇస్తే నాకు చాక్లెట్ ఇచ్చింది, ఇదిగో" అని ఇస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ," చూసావా మరి, అజాగ్రత్తగా ఉంటే ఏమౌతుందో, ఈసారి నించి అలా చేయ్యకు, సరేనా" అంది. ఉడుత," సరే అమ్మా, అలాగే" అని సంతోషంగా చాక్లెట్ తింటుంది.